
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. గత సంవత్సరం డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఓ ప్రముఖ టీవీ చానల్ ఓ బంపర్ ప్రైజ్ కి సొంతం చేసుకుంది. ఇటీవలే శివరాత్రి కానుకగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ టెక్నికల్ సమస్య వల్ల రిలీజ్ చేయడం కుదరలేదు. కానీ త్వరలోనే రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

