‘ధర్మన్’లో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ఎవరంటే..?

‘ధర్మన్’లో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ఎవరంటే..?

Published on Jul 14, 2026 11:00 PM IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తాజాగా ఈ ప్రాజెక్టులోకి కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ వచ్చి చేరింది. ఈ సినిమాలో ఆమె ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె చేతిలో యష్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు రజనీకాంత్ ‘ధర్మన్’ కూడా ఈ లిస్ట్‌లో చేరడంతో ఆమె కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ కానుంది.

ఈ చిత్రంలో రజనీకాంత్, రుక్మిణిలతో పాటు సిమ్రాన్, రాశీ ఖన్నా, యోగి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల ప్లాన్‌ను ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నారు.

తాజా వార్తలు