‘రూలర్’గా బాలయ్య ప్రభావం ఎక్కడ ?

Published on Dec 3, 2019 12:23 am IST

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పై ఆడియన్స్ లో మాత్రం పెద్దగా బజ్ లేకుండా పోయింది. నిజానికి చిత్రబృందం టీజర్ ను పవర్ ఫుల్ గా కట్ చేసి వదిలినప్పటికీ.. ఇప్పటికే అలాంటి యాక్షన్ అండ్ బిల్డప్ షాట్స్ లో బాలయ్యను చూసి చూసి జనానికి బాగా బోర్ కొట్టేసింది. సమాజంలో అన్యాయం జరగడం.. దాంతో బాలయ్య రెచ్చిపోయి ఆ అన్యాయాన్ని అరికట్టి న్యాయాన్ని గెలిపించి చివరికీ హీరో అనిపించుకోవడం.. ఇలాంటి రొట్ట కొట్టుడు కథలకు బాలయ్య ఇక ఎండింగ్ కార్డు ఇవ్వకపోతే.. హిట్ మాట తర్వాత సంగతి, ఇక నుండి బాలయ్య సినిమాలకు ఓపెనింగ్స్ కూడా రావు.

అన్నట్లు ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారట. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More