“సలార్” స్పెషల్ సాంగ్ పై ఆగని రూమర్స్.!

Published on May 5, 2021 10:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ కూడా కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది.

మరి ఈ గ్యాప్ లోనే ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర గాసిప్స్ బయటకు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రశాంత్ నీల్ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని వచ్చింది. మరి ఇప్పుడు ఇదే సాంగ్ కు గాను మరో బ్యూటీ పేరు బయటకి వచ్చింది.

ఆమెనే కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇపుడు ఈమె పేరు ఈ రేస్ లోకి వచ్చింది అని నయా రూమర్ స్టార్ట్ అయ్యింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి కూడా చాలా మేర కేజీయఫ్ టెక్నీషియన్సే పని చేస్తుండగా హోంబలే నిర్మాణ సంస్థ వారే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :