మహేష్ సినిమాపై రెండు పుకార్లు !

Published on May 18, 2019 2:00 am IST

మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అలాగే తర్వాతి సినిమా పనుల్ని కూడా స్టార్ట్ చేశారు. అనిల్ రవిపూడి డిరెక్షన్లో ఈ సినిమా ఉండబోతోంది. ఇకపోతే ఈరోజు ఉదయం నుండి ఈ సినిమాపై రెండు వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి. వాటిలో ఒకటి సినిమాలో నటించనున్న విజయశాంతి రెమ్యునరేషన్ గురించి. ఈ సీనియర్ నటి ఈ చిత్రంలో నటించేందుకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. దీంతో నిర్మాతలు కొంచెం షాక్ తిన్నారని, అయినా ఆ మొత్తం చెల్లించడానికి రెడీ అయ్యారని టాక్.

ఇక మరొక వార్త ఏమిటంటే ఈ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఎంతమేర వాస్తవం ఉందో తెలియాలంటే చిత్ర సన్నిహిత వర్గాల నుండి అధికారిక సమాచారం వెలువడితేనే తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More