ఆరున్నర రోజుల్లో ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ రాశాను – సుజీత్

ఆరున్నర రోజుల్లో ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ రాశాను – సుజీత్

Published on Jul 1, 2014 5:29 PM IST

sujeeth
‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్నా మరో సినిమా ‘రన్ రాజా రన్’. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీరత్ కపూర్ హీరోయిన్ గా, సుజీత్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. గిభ్రన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుజీత్ తనకు డైరెక్టర్ గా అవకాశం ఎలా వచ్చిందా అనే విషయం చెబుతూ ‘వంశీ గారికి ముందు వేరే కథ చెప్పాను. దానికి ఓకే అన్నారు కానీ చివరిగా తర్వాత సినిమా ఆ కథ చేద్దాం అనే సరికి ఏం అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు ముందు టైటిల్ ‘రన్ రాజా రన్’ అని అనుకోని కథని రాశాను. కేవలం ఆరున్నర రోజులో స్క్రిప్ట్, డైలాగ్ వెర్షన్ అంతా పూర్తి చేసాను. ఆ కథ కూడా వాళ్ళకి బాగా నచ్చడంతో ఇక ఆగకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయిందని’ సుజీత్ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు