షాక్ ఇస్తున్న ‘పేట’ రన్ టైం !

Published on Dec 24, 2018 5:16 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి 165 వ చిత్రం ‘పేట’ నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రం యొక్క రన్ టైం రివీల్ అయ్యింది. ఏకంగా 2గంటల 51 నిమిషాల నిడివి తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీ నటించిన చిత్రాల్లో ‘లింగ’ తరువాత ఎక్కువ రన్ టైం కలిగిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , బాబీ సింహ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు.

అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10 న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నాడు. మరి తెలుగులో ఈ చిత్రం అదే డేట్ కు విడుదలవుతుందో లేక సంక్రాంతికి బడా చిత్రాలు థియేటర్లలోకి వస్తుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :