సంక్రాంతికి విడుదలవుతున్న నాలుగు సినిమాల రన్ టైం !

Published on Jan 7, 2019 10:01 am IST

టాలీవుడ్ కి సంక్రాంతి చాలా కీలకం కానుంది. ఈ పండుగ సీజన్ కి 3 తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా ప్రేక్షకులముందుకు రానున్నాయి. అందులో భాగంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ , ఎఫ్ 2’ థియేటర్లకు క్యూ కట్టనున్నాయి.

అందులో మొదటగా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈ నెల 9న విడుదలకానుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్ తో 2గంటల 51 నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

రెండవ చిత్రం సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘పేట’. ఈచిత్రం ఈ నెల 10న తమిళ్ తో పాటు తెలుగులోను విడుదలకానుంది. ఈచిత్రం యు/ఏ సర్టిఫికెట్ తో 2గంటల 52నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ మధ్య కాలంలో ఇంత రన్ టైం కలిగిన సినిమాకూడా ఇదే కావడం విశేషం.

మూడవ చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ. మిగిలిన మూడు సినిమాల్లో కన్నా ఈచిత్రానికి హైప్ ఎక్కువగా వుంది. ఇక ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ తో 2గంటల 26నిమిషాల రన్ టైంతో విడుదలకానుంది.

ఇక సంక్రాంతి రేస్ లో చివరిగా వస్తున్న చిత్రం ఎఫ్2. వెంకటేష్ , వరుణ్ తేజ్ లు మొదటి సారి కలిసి నటించడం అలాగే హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. ఇక ఈచిత్రం యు/ఏ సర్టిఫికేట్ తో 2గంటల 28నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

మరి ఈ సంక్రాంతి కి విడుదలవుతున్న ఈ నాలుగు సినిమాల్లో ఏచిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More