మా ఇంటి బంగారం : సమంత సినిమా రన్‌టైమ్ ఇదే..!

మా ఇంటి బంగారం : సమంత సినిమా రన్‌టైమ్ ఇదే..!

Published on Jun 12, 2026 2:00 AM IST

Maa Inti Bangaram

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. వైవిధ్యమైన చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ మంచి విజయం సాధించడంతో, ఈ రీ-యూనియన్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం రన్‌టైమ్‌ను 154 నిమిషాలు (2 గంటల 34 నిమిషాలు)గా లాక్ చేసుకుంది. సినిమా కథకు తగ్గట్టుగా ఈ లెంగ్త్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, మరియు సత్యరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.

తాజా వార్తలు