సెన్సేషనల్ హీరోయిన్ కి ఛాన్స్ లు రావట్లేదా ?

Published on Dec 9, 2018 10:00 am IST

పాయల్‌ రాజ్‌పుత్‌ ఒక్క ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. తన బోల్డ్ నెస్ గ్లామర్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. అయినా ఆమెకు మాత్రం ఒరిగిందేమి లేదని తెలుస్తోంది. ‘ఆర్ ఎక్స్ 100’ సంచలనాత్మక విజయం సాధించడంతో ఇక ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు.

కాగా వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఇంతవరకు ఆమెకు మెయిన్ హీరోయిన్ గా చెప్పుకోతగ్గ సినిమానే రాలేదు. ఆ మధ్య మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని.. అల్లు అర్జున్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చిందని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – తేజ కాంబినేషన్ లో వస్తోన్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ లో కూడా పాయల్ ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించిందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే పాయల్ రాజ్ పుత్ మాత్రం ఓ సినిమాలో గెస్ట్ రోల్ కు తప్ప.. ఇంతవరకు ఏ పెద్ద సినిమాకు సైన్ చెయ్యలేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :