కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్ !

Payal

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఈచిత్రంలో గ్లామర్ పరంగానే కాకుండా తన నటన తోను ఆకట్టుకుంది. ఇక ఈచిత్రం తరువాత తెలుగులో వరుస ఆఫర్లు వస్తాయనుకొని ఎదురుచూసిన ఆమెకు నిరాశే ఎదురైయింది. ఆర్ఎక్స్ 100 తరువాత ఇంతవరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు.

ఇక దాంతో ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న ‘ఏంజెల్’ అనే చిత్రంలో పాయల్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా ఆనంది మరో కథానాయికగా నటించనుంది. ఇమ్మాన్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి పాయల్ ఈ చిత్రంతో అక్కడ బిజీ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version