తెలుగువారి గురించి ‘ఆర్ ఎక్స్100’ హీరోయిన్ ఏం చెప్పిందంటే?

Published on Jul 22, 2018 4:24 pm IST


‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది పంజాబీ నటి పాయల్ రాజ్ పుత్. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుని చిత్ర విజయం లో కీలక పాత్రను పోషించింది.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది పాయల్. తెలుగు వారిలో మీకు ఏం నచ్చింది అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ తెలుగు అమ్మాయిలను చూసి షాక్ అయ్యాను. ఫెస్ క్రీం రాయరు ,లిపిస్టిక్ వేసుకోరు చాలా సింపుల్ గా బిందీ పెట్టుకుంటారు అంతే కానీ మా దగ్గర ఆలా ఉండదు . మేకప్ లేకుండా ఒక్క ముఖం కూడా కనిపించదు. అంతెందుకు నేను మొదటి రోజు ‘ఆర్ఎక్స్ 100’ షూటింగ్ కు మేకప్ వేసుకొని వచ్చా డైరెక్టర్ నన్ను చూసి వెళ్లి ముఖం కడుక్కొని రా అన్నారు. కావాలంటే జస్ట్ బిందీ పెట్టుకో చాలు అన్నారు. అదేంటీ ఆయన ఆలా అంటున్నారు అనుకున్న కానీ సినిమా చూస్తే మేకప్ లేకుండా చాలా అందంగా ఉన్నానిపించింది. అలాగే చాలా మంది నన్ను చూసి తెలుగు అమ్మయి అని అనుకుంటుంన్నారు . నాకు తెలుగులోనే సెటిల్ అయిపోవాలని ఉంది . అక్టోబర్ లో కొత్త ప్రాజెక్ట్ గురించి చెపుతానని ఆమె అన్నారు.

సంబంధిత సమాచారం :