‘ఆర్ఎక్స్ 100’ స్పీడ్ కు ఆసినిమాలు అడ్డుపడట్లేదు !

‘ఆర్ఎక్స్ 100’ స్పీడ్ కు ఆసినిమాలు అడ్డుపడట్లేదు !

Published on Jul 20, 2018 6:01 PM IST

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఎక్స్100′. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం 8రోజుల్లోనే తెలుగు రాష్టాల్లో 8కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ రోజు విడుదలైన చిత్రాలు ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ కు అడ్డుపడుతాయని అనుకుంటే ఆ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది ఆర్ఎక్స్ 100.

నిజానికి ఈ రోజు విడుదలైన ‘లవర్ , వైఫ్ అఫ్ రామ్,ఆటగదరా శివ’ చిత్రాలకు పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. అందులో ‘లవర్’ దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చినా చిత్రం కావడంతో బాక్సాఫిస్ వద్ద పర్వాలేదనే వసూళ్లును సొంతం చేసుకుంటుంది. మరి రానున్న ఈ రెండు రోజుల్లోనైనా ఈ చిత్రాలు ఆర్ఎక్స్ 100 దూకుడు కళ్లెం వేస్తాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు