కార్తికేయకి నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి !

Published on Aug 23, 2021 10:38 am IST


ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌ లో కుటుంబ సభ్యులతో పాటు అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం జరిగింది. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా కార్తికేయ నిశ్చితార్థానికి హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక కార్తికేయ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అన్నట్టు కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీయేక “రాజా విక్రమార్క” సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కార్తికేయ ప్రతినాయకుడిగాను నటిస్తూ మెప్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :