‘ఆర్ఎక్స్100’ బాలీవుడ్ లోకి వెళ్లనుందా ?

‘ఆర్ఎక్స్100’ బాలీవుడ్ లోకి వెళ్లనుందా ?

Published on Jul 17, 2018 8:09 PM IST

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు నటించిన అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం’ఆర్ఎక్స్100′. ఇక ఈ చిత్రం విడుదలైన రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ ను సాధిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి కొన్ని పెద్ద బ్యానర్ లనుండి ఆఫర్లు వస్తున్నాయట. చిన్న చిత్రంగా విడుదలై భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయనున్నారట దాంట్లో భాగంగా ఈచిత్ర హక్కుల కోసం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం.

యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రముఖ నటుడు రావు రమేష్ అలాగే సీనియర్ యాక్టర్ రాంకిలు ముఖ్య పాత్రల్లో నటించారు. దాదాపు 3కోట్ల బడ్జెట్తో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ 12కోట్ల ఫై చిలుకు వసూళ్లను ఖాతాలో వేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు