ఆర్ఎక్స్100 హీరోయిన్ ను పక్కన పెట్టేశారా?

Published on Jul 22, 2018 1:18 pm IST

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన చిత్రం’ఆర్ఎక్స్ 100′. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న తే మౌత్ టాక్ బాగుండడం తో ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన మొదటి చిత్రం గా రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఈచిత్ర టీం ప్రమోషన్స్ లో భాగంగా విజయాత్రను చేపడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రం యొక్క పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రొరింగ్ బ్లాక్ బ్లాస్టర్ పేరుతో విడుదలచేసిన ఈ పోస్టర్లో సినిమాకు పనిచేసిన ముఖ్యమైన టెక్నిషన్స్ తో పాటు హీరో , డైరెక్టర్ , నిర్మాత ఫొటోలు కనిపించాయి కాని హీరోయిన్ పాయల్ ఫొటో లేదు. దాంతో ఈచిత్ర పోస్టర్ ఫై విమర్శలు వెలుబడుతున్నాయి. చిత్రం ఇంత పెద్ద విజయం సాధిచడంలో ఆమెదే కీలక పాత్రని ఒప్పుకోవాల్సిందే. యువత ను థియేటర్లకు రప్పించడం తో పాటు తన నటనతో ను ఆకట్టుకుంది. మరి అలాంటి ఆమె ఫొటో లేక పోవడం ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. మరి ఈ చిత్ర టీం కావాలనే ఆమెను నిర్లక్ష్యం చేశారా లేక హడావిడిలో ఆమె ఫొటో వేయడం మర్చిపోయారా అనే విషయం తెలియాల్సి వుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :