సాహో సైరా ఫలితాలు అటు ఇటు ఐయ్యాయి

Published on Oct 13, 2019 11:25 pm IST

టాలీవుడ్ నుండి గత రెండు నెలల్లో విడుదలైన భారీ చిత్రాలు సాహో మరియు సైరా. ఈ రెండు చిత్రాల బడ్జెట్ ఆరు వందల కోట్లకు పై మాటే. దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో భారీగా ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. సాహో ఆగష్టు 30న విడుదల కాగా సైరా నరసింహారెడ్డి ఈనెల 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలైంది. ఈ రెండు చిత్రాలు మిశ్రమ ఫలితాలు అందుకోవడం గమనార్హం.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో మూవీ హిందీలో మంచి విజయాన్ని అందుకుంది, కానీ అనూహ్యంగా సొంత గడ్డపై వెనుకబడింది. హిందీలో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాహో తెలుగులో మాత్రం చాలా చోట్ల నష్టాలు మిగిల్చింది. కాగా సైరా పరిస్థితి సాహో కు పూర్తి వ్యతిరేకం అని చెప్పాలి. తెలుగులో కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపిన సైరా హిందీలో మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. అక్కడ సైరా కనీస ఆదరణ దక్కించుకోలేక పోవడం విస్మయానికి గురిచేసింది. అక్కడ సరైన ప్రొమోషన్స్ నిర్వహించక పోవడం వలన మూవీలో మంచి కంటెంట్ ఉన్నా ఆదరణకు నోచుకోలేదు. ఇలా సాహో, సైరా చిత్రాలు విరుద్ధమైన ఫలితాలు అందుకున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More