ప్రభాస్ పై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపిన సుజీత్.!

Published on Jul 4, 2021 4:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేసిన “సాహో” కూడా ఒకటి. బాహుబలి సిరీస్ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఓవరాల్ గా సరైన విజయం అందుకోలేదన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ప్రభాస్ తన క్యాపబిలిటీ 400 కోట్ల మార్క్ ని ఎక్కించేసాడు.

అయితే కథా పరంగా సుజీత్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ తాను విజువల్ గా చూపించిన సీక్వెన్స్ లు మాత్రం పార్టులు పార్టులుగా ఇప్పటికీ మూవీ లవర్స్ రిపీటెడ్ గా చూస్తారు. ఆ ఇంపాక్ట్ ని మాత్రం సుజీత్ బలంగా కలుగజేసాడు. అయితే లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ పై ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో సరికొత్త విషయాలు తెలిపాడు.

ప్రభాస్ ఒక మంచి లెర్నర్ అని తనకి తెలియనిది ఏ విషయం అయినా కూడా ఎలాంటి వారు చెప్పినా సరే చాలా శ్రద్దగా వింటాడని అలాగే ప్రభాస్ ని కలిసిన ఎవరైనా కూడా తమ లైఫ్ లో ఎంతమందిని కలిసినా వారి లిస్ట్ లో కొంతమంది మంచి వ్యక్తుల జాబితా తీస్తే కనుక ఖచ్చితంగా ప్రభాస్ టాప్ 5 లో ఉంటాడని తెలిపాడు.

తనకి అయితే మాత్రం టాప్ 1 లో ఉంటాడని ప్రభాస్ వ్యక్తిత్వం కోసం అద్భుతంగ అభివర్ణించాడు. అలాగే ఇప్పటికీ అయినా కూడా ప్రభాస్ నేను కాల్ చేసి స్క్రిప్ట్ ఉంది అంటే కాదు అనకుండా చేస్తాడని ఎందుకంటే అంత నమ్మకం నాపై పెట్టుకున్నాడని సుజీత్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :