క్రేజీ డైరెక్టర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడా ?

Published on Aug 3, 2020 10:40 am IST

యంగ్ డైరెక్టర్ సుజీత్ తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ ప్రవల్లిక రెడ్డితో ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా, ఆగస్టులో వివాహం జరుగుతుందని వెల్లడించారు. అయితే సుజీత్ నిన్న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఆత్మీయల మధ్య ప్రవల్లిక ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

సుజీత్, ప్రవల్లిక పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు గత రాత్రి నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తన పెళ్లికి సంబంధించి సుజీత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గోపీచంద్ నటించబోయే చిత్రం కోసం సుజీత్ యువి క్రియేషన్స్‌తో ఒక ప్రాజెక్ట్‌లో సంతకం చేసినట్లు వార్తకు వస్తున్నాయి.

ఇక గత ఏడాది ప్రభాస్ హీరోగా విడుదలైన భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ సాహో చిత్రానికి పని చేసిన సుజీత్ త్వరలోనే చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడని ప్రకటించినా ఆ తరువాత సుజీత్ లూసిఫర్ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More