సాహో టాక్ కి వసూళ్లకి సంబంధం లేదుగా

Published on Aug 31, 2019 3:55 pm IST

ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించాడు. సాహో మొదటి రోజు 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేసింది. హిందీలో మొదటి రోజు 24కోట్ల వసూళ్లతో 2019 సంవత్సరానికి గాను మూడవ బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది. ఇక తెలుగు,తమిళ, మలయాళ భాషలలో కలిపి దాదాపు 75కోట్లకు పైగా వసూళ్లతో మొదటిరోజు అన్ని భాషలతో కలిపి షుమారు 100కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని తెలుస్తుంది.

మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన సాహో చిత్రం ఈ మాత్రం వసూళ్లు సాధించడం అనేది ప్రభాస్ పాపులారిటీ తెలియజేస్తుంది. ఐతే ఈ కలెక్షన్స్ సాహో పై ఏర్పడిన విపరీతమైన హైప్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ వలన వచ్చిన వసూళ్లు మాత్రమే, రెండవ రోజునుండి పరిస్థితి వేరుగా ఉంటుందని కొందరివాదన. మరి సాహో అసలు సత్తా తెలియాలంటే నిజంగా ఈ వీకెండ్ ముగియాల్సిందే.

సంబంధిత సమాచారం :