సాహో షూటింగ్ అప్డేట్ !

Published on Apr 20, 2019 10:03 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఈ రోజు ముంబై లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.

‘రన్రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. ఆగష్టు 15న ఈచిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈ చిత్రం తోపాటు తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :