‘సాహో’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

‘సాహో’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 3, 2019 12:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకుడిగా రాబోతున్న భారీ చిత్రం ‘సాహో’ . ఇటీవలే ముంబైలో కీలక షెడ్యూల్ ను పుర్తి చేసుకుంది ఈ చిత్రం. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ప్రభాస్ కూడా ఈ నెలాఖర్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని విజువల్స్ నుంచి ప్రభాస్ యాక్షన్ సీన్స్ వరకూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట.

అలాగే ప్రభాస్ పాత్రకు సంబధించి కూడా వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఇటీవలే సాహో నుండి ఒక ఫోటో లీకయింది. ఆ ఫోటోలో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఫొటోలో బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే.. లొకేషన్స్ కూడా తెలుగు సినిమాకి చాలా కొత్తగా ఉన్నట్లు అనిపించాయి. ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు