డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ లోకి ‘సాహో’ !

Published on Oct 17, 2019 2:30 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’. ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా ఇప్పుడు సాహో డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ పై కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌ లో సాహో రిలీజ్ కానుంది. అమెజాన్ సంస్థ సుమారు 42 కోట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద స్థాయికి తగ్గట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సంబంధిత సమాచారం :

X
More