సాహో అక్కడ కూడా విడుదలకానుంది !

Published on Apr 5, 2019 7:29 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ప్రభాస్ నటించిన బాహుబలి కి జపాన్ లో మంచి స్పందన రావడంతో ఈ సాహో ను అక్కడ కూడా విడుదలచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైయ్యాయని సమాచారం. అయితే ఒకే సారి కాకుండా ఇండియాలో విడుదలైన తరువాతే ఈ చిత్రం అక్కడ విడుదలకానుంది.

‘రన్రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఆగష్టు 15న భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :