సాహో ఆవిధంగా సైరా కు మేలు చేసిందట

సాహో ఆవిధంగా సైరా కు మేలు చేసిందట

Published on Sep 28, 2019 1:10 PM IST

saaho syera1

ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ఫలితం తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉన్నా హిందీలో మాత్రం విజయం సాధించింది. ప్రభాస్ మానియా కావచ్చు, చిత్రం పై ఏర్పడిన హైప్ వలన కావచ్చు,కంటెంట్ కావచ్చు సాహో చిత్రం బాలీవుడ్ లో బంపర్ విజయం దక్కించుకుంది. 150కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన సాహో డిస్ట్రిబ్యూటర్స్ కి రెట్టింపు లాభాలు తెచ్చిచ్చిపెట్టినట్టు సమాచారం.

ఐతే సాహో విజయం సైరా చిత్రానికి పరోక్షంగా ఉపయోగపడినట్టు సమాచారం. సైరా చిత్రాన్ని బాలీవుడ్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హిందీ విడుదల హక్కులను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ లో సాహో విజయం స్ఫూర్తి నింపిందని సమాచారం. బాహుబలి చిత్రాన్ని మినహాయిస్తే తెలుగు సినిమాలు హిందీలో విడుదలై పెద్ద విజయం సాధించిన దాఖలాలు లేవు. సాహో విజయం కంటెంట్ ఉంటే ప్రాంతీయ భేదాలు లేకుండా చిత్రాన్ని ఆదరిస్తారని నిరూపించింది. దీనితో అక్కడ సైరా డిస్ట్రిబ్యూటర్స్ సైరా విజయంపై ధీమాగా ఉన్నారట. సైరా కూడా విజయం సాధిస్తే తెలుగు చిత్రాలు అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుబోవడం ఖాయం.

సైరా హిందీ హక్కులను ప్రముఖ బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ దక్కించుకున్నారు. ముంబైలో నిన్న జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో చిరంజీవితో పాటు, ఫర్హాన్ అక్తర్, అమితాబ్ పాల్గొనడం జరిగింది. ఇక సైరా వచ్చే నెల 2న గ్రాండ్ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు