అన్ని ప్రధాన నగరాల్లో సాహో వేడుకలు

Published on Aug 16, 2019 7:10 am IST

సాహో విడుదలకు ఇంకా 15రోజులు కూడా లేదు. దీనితో సాహో యూనిట్ ప్రచార కార్యక్రమాలపై ద్రుష్టి కేంద్రీకరించాయి. కాగా ఈనెల 18న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అట్టహాసంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.వినూత్న పద్దతిలో భారీగా నిర్వహించనున్న ఈ వేడుకకు లక్షకు పైగా అభిమానులు హాజరుకానున్నారని సమాచారం.
ఐతే సాహో దేశంలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో లో తెలుగుతో పాటు మిగతా వర్షన్స్ కి హైప్ తేవడం కోసం ఆయా రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రీరిలీజ్ వేడుక జరుపాలని నిర్ణయించారట. అందులో భాగంగా ముంబై, కొచ్చి, చెన్నై వంటి నగరాలలో అశేష అభిమానుల మధ్య సాహో ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నారని సమాచారం. ఈ వేడుకలలో ఆయా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కలదు.

యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సాహో చిత్రంలో ప్రభాస్ కి జంటగా శ్రద్దా కపూర్ నటిస్తుండగా, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, ఎవ్లీన్ శర్మ, లాల్, చుంకి పాండే, వెన్నెల కిషోర్, మురళి శర్మ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నేపధ్య సంగీతం జిబ్రాన్ అందించారు.

సంబంధిత సమాచారం :