సాహో టీం ఉత్తర భారత ప్రచారానికి రెడీ

Published on Aug 27, 2019 2:02 pm IST

విడుదల సమయం దగ్గర పడేకొద్దీ సాహో టీం ప్రచార జోరు పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా భారీ ప్రచారం ఏర్పడే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. దీని కోసం నేడు ప్రభాస్, శ్రద్దా కపూర్ లతో కలిసి సాహో టీం ఉత్తర భారతం లోని ప్రధాన నగరాలలో సందడి చేయనున్నారట. ఇందులో భాగంగా లక్నో, చండీఘర్, జైపూర్ సిటీలను సందర్శించి అక్కడి మీడియా ప్రతినిధులతో సమావేశమై చిత్ర విశేషాలు పంచుకోనున్నారు.

భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ తో పాటు ఓవరాల్ గా మంచి వసూళ్ల కొరకు ఈ తరహా ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ నెల 30న సాహో విడుదల నేపథ్యంలో ఇంకా కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. అందుకే నేడు సాహో ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రధాన నగరాలను సందర్శించనున్నారు .

సంబంధిత సమాచారం :