‘సాహో’ కోసం ప్రభాస్ నైట్ కూడా.. !

Published on May 19, 2019 6:28 pm IST

సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఫ్యాచ్ వర్క్ కు సంబంధించిన షూటింగ్ ను త్వరగా పూర్తి చెయ్యడానికి చిత్రబృందం రాత్రి పూట కూడా పని చేస్తోంది. ప్రస్తుతం సాహో టీమ్ నైట్ షూట్ చేస్తున్నారు.

అలాగే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబధించిన పార్ట్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం :

More