సాహో యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Aug 30, 2019 11:44 am IST

ఈ మధ్య కాలంలో సాహో మూవీకి వచ్చినంత ప్రచారం మరే చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. ట్రైలర్, టీజర్స్ ద్వారా పెరిగిన అంచనాలతో పాటు, ప్రభాస్ నిరవధికంగా పాల్గొన్న ప్రొమోషన్స్ కార్యక్రమాల వలన సాహో చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో యూఎస్ లో ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్స్ కూడా స్థాయికి తగ్గట్టే వచ్చాయని తెలుస్తుంది.

సాహో యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారా $800,899 డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.మొత్తం 290 లొకేషన్స్ నుండి గురువారం రాత్రి 10:00 వరకు వచ్చిన సంచారం ప్రకారం సాహో ఆ కలెక్షన్స్ రాబట్టిందట. ఐతే ఈ చిత్రానికి వచ్చిన ప్రచారం, తెరకెక్కిన బడ్జెట్ దృష్ట్యా చూస్తే ఈ కలెక్షన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి. వారాంతంలో పాటు, ఒక రోజు చవితి సెలవు దినం రావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఏదేమైనా సాహో అనేక గత చిత్రాల రికార్డులను అధిగమిస్తుంది అనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :