సాహో రికార్డ్ ల ప్రభంజనం మొదలైంది.

Published on Aug 16, 2019 2:41 pm IST

విడుదల కు ముందే ప్రభాస్ సాహో రికార్డుల వేట మొదలైంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 350కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఔరా అనిపించిన సాహో మరో విశేషతనుసొంతం చేసుకుంది. సాహో చిత్రాన్ని ఫ్రాన్స్ లో ఓ ప్రతిష్టాత్మక థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో గల ది గ్రాండ్ రెక్స్ థియేటర్ యూరపు ఖండంలోనే అతిపెద్ద ధియేటర్ గా ప్రసిద్ధిగాంచింది. వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గ్రాండ్ రెక్స్ థియేటర్ 1932లో ప్రారంభించారు.

అప్పటినుండి అనేక ప్రఖాత్య సాంస్కృతిక,కళా, సినిమా ప్రదర్శనలకు వేదికగా మారింది. ఒకేసారి 2800 మంది ఈ హాలులో ప్రదర్శన చూడవచ్చు. అలాంటి ప్రఖ్యాత థియేటర్లో సాహో మూవీ ప్రదర్శించనున్నారు. గతంలో రజని కబాలి, విజయ్ మెర్సల్, బాహుబలి చిత్రాలు ఇక్కడ ప్రదర్శించారు. అక్కడ రెండు చిత్రాల ప్రదర్శన తో సౌత్ ఇండియాలోనే మొదటి హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కాడు.

సాహో ఈ నెల 30న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటినుండే ఆ గ్రాండ్ రెక్స్ ధియేటర్ గోడలపై సాహో వీడియోలతో ప్రచారం మొదలైపోయింది. విడుదలకు ముందే ఎన్ని విశేషతలను సంతరించుకుంటున్న సాహో విడుదల తరువాత ఎన్ని రికార్డులు సాధించనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :