‘సాక్ష్యం’ కు శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే కలిసొచ్చింది !

Published on Jul 30, 2018 8:32 am IST


శ్రీవాస్ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం చిత్రం సాక్ష్యం. జూలై 27న విడుదలైన ఈ చిత్రం బి సి సెంటర్ల లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్నా ఏ సెంటర్లలో మాత్రం మోస్తరు కలెక్షన్స్ తో సరిపెట్టుకుంటుంది. ఇక 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి శాటిలైట్ రూపంలో కలిసొచ్చింది.

ఈచిత్రంలో హెవీ యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో ఈచిత్రం యొక్క హిందీ శాటిలైట్ హక్కులు రూ . 8కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇక తెలుగు శాటిలైట్ రూపంలో మరో 5కోట్లను ఖాతాలో వేసుకొని మొత్తం శాటిలైట్ పరంగా 13 కోట్ల ను కలెక్ట్ చేసింది ఈచిత్రం.

సంబంధిత సమాచారం :