సాక్ష్యం విడుదల తేది ఖారారు !
Published on Feb 18, 2018 12:25 pm IST

అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జయజానకి నాయక చిత్రంతో మంచి విజయాలు అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా సాక్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 11న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా లో మీనా హీరో మదర్ పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాలో అన్ని ఇంటరెస్టింగ్ ఎలెమెంట్స్ ఉంటాయట. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తి కాంత్ ఈ సినిమాను మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు.

 
Like us on Facebook