సామి కి క్లీన్ యు సర్టిఫికేట్ !

సామి కి క్లీన్ యు సర్టిఫికేట్ !

Published on Sep 19, 2018 3:17 PM IST

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ జంటగా హరి దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కిన చిత్రం ‘సామీ స్క్వేర్’. ఔరా సినిమాస్ ,పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం ఫై కావ్య వేణుగోపాల్ , బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈచిత్రాన్నితెలుగులో ‘సామి’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబూ తమిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21న తెలుగు ,తమిళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు