చియాన్ విక్రమ్ , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్’ . తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షుకులముందుకు రానుంది.
సూపర్ హిట్ మూవీ సామి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని తమిన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబూ తమీన్ నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రం సామి పేరుతో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.


