2003లో చియాన్ విక్రమ్, త్రిషలు జంటగా వచ్చిన చిత్రం ‘సామి’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సామీ స్క్వేర్’ ను మొదలుపెట్టారు దర్శకుడు హరి. ఇందులో విక్రమ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రం యొక్క తమిళ మోషన్ పోస్టర్ మొన్ననే విడుదలై అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఆ మోషన్ పోస్టర్ చూసిన అందరూ సినిమా అదిరిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు.
ఈ సినిమాను తెలుగులో సైతం విడుదలచేస్తుండటంతో మోషన్ పోస్టర్ ను కూడ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. రేపు 20వ తేదీన ఇది విడుదలకానుంది. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రమ్, హరి సినిమాలకి తెలుగునాట మంచి క్రేజ్ ఉండటం మూలాన తెలుగునాట ఈ సినిమాని మంచి స్థాయి విడుదలచేయనున్నారు.


