విషాదం..నటుడు ‘అదుర్స్’ రఘు కి పితృ వియోగం.!

Published on Aug 5, 2022 9:00 am IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి అనేక మంది స్టార్ కమెడియన్స్ కి పలు సినిమాల వల్ల కానీ హీరోస్ వల్ల కానీ మంచి బ్రేక్ వచ్చి వాటితోనే వారి కెరీర్ లో కూడా పేర్లు నిలిచిపోతాయి. మరి అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన అదుర్స్ సినిమాలో మెప్పించి ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా మారిన అదుర్స్ రఘు ఇంట విషాదం నెలకొంది.

ఇక వివరాల్లోకి వెళితే రఘు తండ్రి అయినటువంటి వెంకట్రావ్ కరుమంచి గత కొన్నాళ్ల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్నారట. ఇక పరిస్థితి చేయి దాటడంతో నిన్న చికిత్స పొందుతూ తన 74 వ ఏట స్వర్గస్థులు అయినట్టుగా తెలిసింది. దీనితో ఈ అనుకోని సంఘటనతో రఘు కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని రఘు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మా 123తెలుగు యూనిట్ నివాళులు అర్పిస్తుంది.

సంబంధిత సమాచారం :