విషాదం..ఘంటసాల రెండో కుమారుడు కన్నుమూత.!

Published on Jun 10, 2021 11:00 am IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీతానికి ఒక సుస్థిర అధ్యాయం ఉన్న సంగతి తెలిసిందే. తన అపురూపమైన గాత్రం అద్భుతమైన సంగీతంతో తెలుగు సాహితంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు.

అయితే ఆయన రెండవ తనయుడు శ్రీ రత్నకుమార్ గారు కన్ను మూయడం ఇపుడు తెలుగు పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. అయితే అసలు వివరాల్లోకి వెళితే ఆయన కొన్నాళ్ల కితమే కరోనా బారిన పడగా ఇటీవలే రెండు రోజులు కితమే కరోనా నెగిటివ్ వచ్చి కోలుకున్నారట.

కానీ అంతకు ముందు నుంచే కిడ్నీ సమస్య పై కూడా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆకస్మిక గుండెపోటు రావడంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన వెయ్యికి పైగా పలు భాషా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. మరి ఆయన అకాల మరణం పట్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా 123 తెలుగు టీం ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :