విషాదం: దిగ్గజ నిర్మాత కన్నుమూత

విషాదం: దిగ్గజ నిర్మాత కన్నుమూత

Published on Dec 4, 2025 10:12 AM IST

AVM
మన ఇండియన్ సినిమా దగ్గర కేవలం నిర్మాణ సంస్థ లోగో అండ్ మ్యూజిక్ తోనే జనాల మైండ్ లో రిజిస్టర్ అయ్యిపోయిన ప్రొడక్షన్ హౌస్ లు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ నే ‘ఏ వి ఎం ప్రొడక్షన్స్’ కూడా ఒకటి. అయితే ఈ నిర్మాణ సంస్థ నుంచి అనేక ఎవర్ గ్రీన్ సినిమాలు వచ్చాయి. మరి ఇలాంటి నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు ఎం శరవణన్ తన 86వ ఏట తుది శ్వాస విడిచినట్టుగా తెలిసింది.

దీనితో సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరి నుంచి తమిళ్ లో సెన్సేషనల్ హిట్స్ శివాజీ, అయాన్ (వీడోక్కడే), యజమాన్, తిరుపతి అలాగే తెలుగులో భక్త ప్రహ్లాద, మూగ నోము, ఆ ఒక్కటి అడక్కు లాంటి సినిమాలు అందించారు. అయితే తాను వయసు రీత్యా సమస్యలు మూలాన తన తుది శ్వాస విడిచారు. ఇక ఈ వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు