“సడక్ 2” ట్రైలర్ కు ఈ వరస్ట్ రికార్డు.!

Published on Aug 12, 2020 4:48 pm IST

లేటెస్ట్ గా విడుదల కాబడిన బాలీవుడ్ మూవీ “సడక్ 2” ట్రైలర్ కు ఊహించని షాక్ తగిలింది. ఈరోజు ఉదయం యూట్యూబ్ లో అధికారికంగా విడుదల కాబడ్డ ఈ ట్రైలర్ కు ఒక్క గంటలోనే లక్షకు పైగా డిస్ లైకులు వచ్చేసాయి. దీనితో ఈ ట్రైలర్ మన దేశంలోనే మోస్ట్ డిస్ లైక్డ్ ట్రైలర్ గా నిలిచిపోయేలా ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ భారీ ఎత్తున డిస్ లైకులు కలిగిన ట్రైలర్స్ జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇంకా ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే 1.5 మిలియన్ డిస్ లైకులు ఈ ట్రైలర్ కు వచ్చేసాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటో కూడా అందరికీ తెలిసిందే.

సుశాంత్ మరణానికి నిందితులుగా పరిగణించబడుతున్న మహేష్ భట్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ ట్రైలర్ కు నెటిజన్స్ ఈ వరస్ట్ రికార్డును అందించారు. సంజయ్ దత్, ఆలియా భట్, పూజా భట్, ఆదిత్య రాయ్ కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే ఆగష్టు 28 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమింగ్ కు రానుంది.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More