‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సదా. ఆ తర్వాత చియాన్ విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ చిత్రంలో నటించింది. మొత్తానికి వెండితెరకు పరిచయమైన అతి కొద్ది సమయంలో తెలుగు, తమిళ సినీరంగాల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకున్న సదా ఆ తరువాత మాత్రం కొన్ని కారణాల రీత్యా కెరీర్ లో వెనుకబడిపోయింది. అయితే, ఆ సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా నటించలేకపోయింది.
ఈ విషయాన్ని ఇటీవల ఓ వేదికపై సదా స్వయంగా చెప్పుకొస్తూ ‘చంద్రముఖి’ చిత్రంలో నటించే ఛాన్స్ నాకు రెండు సార్లు వచ్చినా వివిధ కారణాల రీత్యా నేను నటించలేకపోయాను. ఆ ఛాన్స్ మిస్ అయిందే అని పలుమార్లు బాధపడ్డాను’ అని వివరించింది. సదాకు హీరోయిన్ కాకముందే సినిమాలో ఇతర పాత్రలు నటించే అవకాశం వచ్చినా జయం చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది.


