RAAKA: ఐకాన్ స్టార్ పై జెన్ జీ సెన్సషన్ సాయి అభ్యంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

RAAKA: ఐకాన్ స్టార్ పై జెన్ జీ సెన్సషన్ సాయి అభ్యంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 4, 2026 7:59 AM IST

raaka-and-sai-abhyankar

ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రమే “రాకా”. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తీస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాకి ఉన్న పలు హైలైట్ అంశాల్లో జెన్ జీ సెన్సేషన్ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఫాక్టర్ కూడా ఒకటి.

తన టైటిల్ రివీల్ థీమ్ ట్రాక్ హిట్ అయ్యింది. అయితే అల్లు అర్జున్ విషయంలో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తాను అల్లు అర్జున్ ని ఎప్పుడు కలవడానికి వెళ్ళినపుడు చాలా టెన్షన్ పడ్డానని ఆయనకి తన వర్క్ నచ్చుతుందో లేదో అని కంగారు ఉంటుంది. ఎందుకంటే బన్నీకి ఉన్న మ్యూజికల్ టేస్ట్ గ్రేట్. తనకి ఏది బాగుంది ఏది బాలేదు అనేది బాగా తెలుసు. ఇప్పుడు జెన్-జెడ్ కి ఏమి ఇష్టమో కూడా చర్చిస్తాం అని సాయి తెలిపాడు. దీనితో బన్నీ విషయంలో తన కామెంట్స్ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

తాజా వార్తలు