పెద్ద ఎత్తున వివాదం రేపుతున్న సైఫ్ వెబ్ సిరీస్.!

Published on Jan 16, 2021 12:07 pm IST

మన దగ్గర మంచి ఫేమ్ ఉన్న బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ యాప్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. ఈ లాక్ డౌన్ లో మరింత ఫేమ్ తెచ్చుకున్న ఈ స్ట్రీమింగ్ యాప్ లో ఇప్పటికే అనేక సరికొత్త సినిమాలు విడుదల కాబడ్డాయి. మరి వీటితో పాటు అనేక వెబ్ సిరీస్ లు కూడా ఇందులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం నెటిజన్స్ ఆగ్రహానికి లోను అయ్యేవి కూడా చాలానే ఉన్నాయి.

అలా లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ చేసిన వెబ్ సిరీస్ “తాండవ్”. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం చేసిన ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ లేస్తుంది. ఈ సిరీస్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసే సన్నివేశాలు ఉన్నాయని హిందూ దేవుళ్లపై కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా తీసారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇలాంటి సిరీస్ ను చేసిన సైఫ్ ను ఆ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతే కాకుండా ఈ సిరీస్ ను బ్యాన్ చెయ్యాలని ఉత్తరాది పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తుండడం ఆశ్చర్యకరం. మరి ఈ వివాదం ఎటు వైపుకు దారి తీస్తుందో చూడాలి. అయితే ఆ మధ్య ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన “పాతాళ లోక్” సిరీస్ కు కూడా ఇలాంటి సెగ తగిలింది.

సంబంధిత సమాచారం :

More