యూవీ క్రియేషన్స్ లో మెగా హీరో !

Published on May 1, 2019 2:12 pm IST

వరుస పరాజయాల తరువాత ఇటీవల చిత్రలహరి తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లో హిట్ అనిపించుకుంది కానీ ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. దాంతో ఈ చిత్రం కూడా తేజూ కెరీర్ కి ఉపయోగపడే విజయాన్నిఅందిచలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత సాయి ధరమ్ ,మారుతి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రం కోసం ప్రస్తుతం తేజూ బరువు తగ్గే పనిలో వున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక మారుతి లాస్ట్ సినిమా శైలజా రెడ్డి అల్లుడు గత ఏడాది విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది . దాంతో ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో వున్నాడట మారుతి.

సంబంధిత సమాచారం :

More