అఫీషియల్ : విశాల్‌తో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన హీరోయిన్

అఫీషియల్ : విశాల్‌తో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన హీరోయిన్

Published on May 19, 2025 11:00 PM IST

తమిళ హీరో విశాల్ తెలుగు ఆడియెన్స్‌లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఆయన నటించే తమిళ చిత్రాలను తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారు. ఇక గతకొద్ది రోజులుగా విశాల్ పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే, తాజాగా విశాల్‌తో పెళ్లిపై హీరోయిన్ సాయి ధన్సిక క్లారిటీ ఇచ్చేసింది.

ఓ ఈవెంట్‌లో మాట్లాడిన సాయి ధన్సిక త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని.. హీరో విశాల్‌తో తన పెళ్లి ఆగస్టు 29న జరగనుందని తెలిపింది. అదే ఈవెంట్‌లో విశాల్ కూడా ఉండటంతో వారు అధికారికంగా తమ పెళ్లి డేట్‌ను ప్రకటించారు.

ఇక ఈ వార్తతో వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విశాల్-సాయి ధన్సిక వివాహం కోసం సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు