
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటు ఇంకా విడుదల కాని తన సినిమా ‘రేయ్’ విడుదలకు సన్నాహలు జరుగుతున్నాయి. ఇక తాజాగా.. ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ అనే కన్నడ సినిమా రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కన్నడలో గత సంవత్సరం క్రిస్‌మస్ కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాను ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్. ఎన్ రాజ్‌కుమార్ తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇదే విషయమై ఆ సినిమాను చిరంజీవికి చూపించగా ఆయన సాయిధరమ్ తేజ్‌తో చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. ఇక సాయిధరమ్ తేజ్‌కి ఈ కథను వినిపించి సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఆ నిర్మాత ఉన్నారని సమాచారం.

