సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా న్యూస్ !
Published on Feb 18, 2018 3:02 pm IST

ఇంటిలిజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు డార్లింగ్ సామి మాటలు రాస్తున్నారు.

ఈ సినిమా తరువాత సాయి నటించబోయే తరువాతి సినిమాను భగవాన్, పుల్లరావ్ నిర్మించబోతున్నారు. ఈ సినిమా మే నుండి ప్రారంభం కానుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. కరుణాకర్ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించబోతున్నారు.

 
Like us on Facebook