సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా వివరాలు !

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను కె.ఎస్. రామారావ్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచరం మేరకు ఈ హీరో తన నెక్స్ట్ సినిమాను కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మొదట నాని ఈ సినిమాలో నటించాలి కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నాని స్థానంలో సాయి ధరం తేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ సినిమాలు తీసే దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి తో సాయి ధరమ్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఎప్పుడుఉంటుందో చూడాలి.