చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్ తో సాయి ధరమ్ సేఫ్ !

Published on Mar 5, 2019 10:00 pm IST

వరుస పరాజయాలతో మార్కెట్ ను తగ్గించుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. అయితే ఆ ప్రభావం తన కొత్త చిత్రం ఫై పడలేదు. మార్కెట్ తగ్గినా కూడా తన కొత్త చిత్రానికి డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం తేజు ‘చిత్రలహరి’ లో నటిస్తున్నాడు. ‘నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ’ ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నా ఈ చిత్రం ప్రస్తుతం తుద చివరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది.

ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం లో ఈ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనుండగా ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే సాయి ధరమ్ కు మళ్ళీ సాలిడ్ మార్కెట్ క్రియేట్ కానుంది.

ఎమోషనల్ ఎంటర్టైనేర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ కథానాయికులుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12 విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More