సాయి ధరమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ?

Published on Dec 26, 2018 10:00 pm IST


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. వరుస పరాజయాలతో ఒత్తిడిలో వున్న ఈ హీరో కొంత గ్యాప్ తరువాత ఫ్రెష్ లుక్ తో ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ కుమార్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్ర లహరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది.

ఇక ఈ చిత్రంసెట్స్ మీద ఉండగానే తేజు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘పిల్ల జమిందార్ , భాగమతి’ చిత్రాలతో మెప్పించిన దర్శకుడు అశోక్ తో తేజు సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. తర్వలోనే ఈ చిత్రం ఫై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :