మెగా ఫ్యామిలీ నుండి పరిచయమైన మరో హీరో సాయి ధరమ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’తో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. మెగా అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ కొత్త కుర్రాడిపై నెలకొని ఉంది. సినిమా ఘనవిజయం సాదించడంతో అప్పుడే అభిమానులు అతనికి పవర్ జెనరేటింగ్ స్టార్ బిరుదును ఇచ్చేశారు. తొలిచిత్రంతోనే అద్బుతమైన డాన్సర్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇండస్ట్రీ ప్రముఖుల నుండి, ప్రక్షకుల నుండి సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కి మంచి స్పందన లభించింది. నేచురల్ పెర్ఫార్మన్స్ చేశాడు అంటూ కితాబు అందుకున్నాడు. అతని స్క్రీన్ ప్రజెంస్ బాగుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు భవిష్యత్ లో పోటి ఇవ్వగల సత్తా అతనిలోఉందని, వాళ్ళలా స్టార్ హీరో అయ్యే అవకశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘గబ్బర్ సింగ్’ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటించడానికి సాయి ధరమ్ తేజ్ రెడీ అవుతున్నాడు. అతని కెరీర్ కు ఈ సినిమా పెద్ద బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు.


